యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ కు ఫ్లైట్ దుబాయ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం

- April 07, 2020 , by Maagulf
యూఏఈ: ఇండియా, పాకిస్తాన్ కు ఫ్లైట్ దుబాయ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం

దుబాయ్ బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఫ్లై దుబాయ్ ఇండియా, పాకిస్తాన్ కు టికెట్స్ బుకింగ్ ను ప్రారంభించింది. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవటంతో వేల మంది భారతీయులు, పాకిస్తానీయులు యూఈఏలో చిక్కుకుపోయారు. వారిని తమ సొంత దేశాలకు తరలించటంలో భాగంగా వచ్చే వారం ఫ్లై దుబాయ్ రెండు దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉంది. అయితే..భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నుంచి ఫ్లై దుబాయ్ కి ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఒక వేళ అనుమతి వస్తేనే సర్వీసులను పునరుద్ధరిస్తామని ఫ్లై దుబాయ్ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14 తర్వాత భారత్ లో లాక్ డౌన్ సడలించే అవకాశాలు ఉండటంతో తమకు అనుమతి వస్తుందనే ఫ్లై దుబాయ్ అంచనా వేస్తోంది. అయితే..యూఏఈలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మాత్రం తమ దేశానికి ప్రత్యేక విమాన సర్వీసులపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతోంది. ఇదిలాఉంటే ఫ్లై దుబాయ్ భారత్ లోని హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, కొచ్చి, లక్నో, ముంబై నగరాలకు ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభించింది. అలాగే పాకిస్తాన్ లోని వివిధ నగరాలకు బుకింగ్స్ స్టార్ట్ చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com