మస్కట్:కరోనా వైరస్ నియంత్రణలో విశేష సేవలు అందిస్తున్న భద్రతా దళాలు
- April 07, 2020
మస్కట్:కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో ఒమన్ భద్రతా బలగాలు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయాలను అమలు చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చెక్ పోస్టుల ఏర్పాటు, తనిఖీలు, వివిధ సంస్థలకు సాయం భద్రత బలగాలు సాయం చేస్తున్నాయి. సుల్తానేట్ భద్రత బలగాల మెడికల్ సర్వీస్ ఆధ్వర్యంలో రాయల్ ఆర్మీ ఆఫ్ ఓమన్ బలగాలు వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ పౌరులకు, రెసిడెంట్స్ కి వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే ఒమన్ రాయల్ వైమానిక దళాలు రవాణాతో పాటు అత్యవసర సమయాల్లో మెడికల్ తరలింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక గవర్నరేట్ పరిధిలో అయిల్ ఉత్పత్తుల రవాణా, ఇతర సరుకుల రవాణాలో రాయల్ నావిక దళాలు తోడ్పాటు అందిస్తున్నాయి. అలాగే గవర్నరేట్ సరిహద్దులో మిలటరీ, ఇతర భద్రతా బలగాలు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ నిర్ణయాలను పాటించటంలో సిటీజన్స్, రెసిడెంట్స్ తూచ తప్పకుండా పాటించాలని సుల్తాన్ సాయుధ బలగాలు, రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే వాహనదారులు ఖచ్చితంగా గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







