మస్కట్:కరోనా వైరస్ నియంత్రణలో విశేష సేవలు అందిస్తున్న భద్రతా దళాలు

- April 07, 2020 , by Maagulf
మస్కట్:కరోనా వైరస్ నియంత్రణలో విశేష సేవలు అందిస్తున్న భద్రతా దళాలు

మస్కట్:కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటంలో ఒమన్ భద్రతా బలగాలు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటైన సుప్రీం కమిటీ నిర్ణయాలను అమలు చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చెక్ పోస్టుల ఏర్పాటు, తనిఖీలు, వివిధ సంస్థలకు సాయం భద్రత బలగాలు సాయం చేస్తున్నాయి. సుల్తానేట్ భద్రత బలగాల మెడికల్ సర్వీస్ ఆధ్వర్యంలో రాయల్ ఆర్మీ ఆఫ్ ఓమన్ బలగాలు వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ పౌరులకు, రెసిడెంట్స్ కి వైద్య సేవలు అందిస్తున్నాయి. అలాగే ఒమన్ రాయల్ వైమానిక దళాలు రవాణాతో పాటు అత్యవసర సమయాల్లో మెడికల్ తరలింపు ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక గవర్నరేట్ పరిధిలో అయిల్ ఉత్పత్తుల రవాణా, ఇతర సరుకుల రవాణాలో రాయల్ నావిక దళాలు తోడ్పాటు అందిస్తున్నాయి. అలాగే గవర్నరేట్ సరిహద్దులో మిలటరీ, ఇతర భద్రతా బలగాలు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ నిర్ణయాలను పాటించటంలో సిటీజన్స్, రెసిడెంట్స్ తూచ తప్పకుండా పాటించాలని సుల్తాన్ సాయుధ బలగాలు, రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చే వాహనదారులు ఖచ్చితంగా గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com