భారత్ లో 'కరోనా' కారణంగా 6గురు మృతి
- April 07, 2020
భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.భారత దేశంలో మంగళవారం 6 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలోని పూణేలో ముగ్గురు మరణించారు. ఆరోగ్య శాఖ ప్రకారం, అందరూ 60 ఏళ్లు పైబడిన వారు. కిడ్నీ, అధిక రక్తపోటు వంటి ఇతర వ్యాధులు కూడా వారికి ఉన్నాయి. దీంతో పూణేలో ఇప్పటివరకు ఎనిమిది మంది మరణించారు. అదే సమయంలో, మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 55 కి చేరుకుంది. సోమవారం రాష్ట్రంలో 7 మంది రోగులు మరణించారు.
ఒడిశా: రాష్ట్రంలో 72 ఏళ్ల వ్యక్తి మరణించాడు. గత మూడు రోజులుగా భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో చేరాడు. అయితే అతను మరణించాక జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది.
మధ్యప్రదేశ్: ఉజ్జయినికు చెందిన ఒక మహిళ రెండు రోజుల క్రితం మరణించింది. ఈ రోజు ఆమెకు కూడా వైరస్ పాజిటివ్ అని వచ్చింది.. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకు 19 మరణాలు సంభవించాయి.
జమ్మూ కాశ్మీర్: కరోనా సోకిన వ్యక్తి మంగళవారం మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ముగ్గురు రోగులు మరణించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు