డెబిట్‌ కేసుల్లో జైలు శిక్షల్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

- April 08, 2020 , by Maagulf
డెబిట్‌ కేసుల్లో జైలు శిక్షల్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

రియాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో సౌదీ అరేబియా, తాత్కాలికంగా జైలు శిక్షల్ని ‘అన్‌పెయిడ్‌ డెబిట్స్‌’ కేసుల్లో నిందితులుగా వున్నవారికి రద్దు చేసింది. కింగ్‌ సల్మాన్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటుగా పేరెంట్‌ చైల్డ్‌ విజిటేషన్‌ రైట్స్‌కి సంబంధించిన తీర్పుల్ని కూడా రద్దు చేస్తూ కింగ్‌ సల్మాన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత తగ్గేదాకా ఈ నిర్ణయాలు అమల్లో వుంటాయి. జస్టిస్‌ మినిస్టర్‌ అలాగే సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ వాలిద్‌ అల్‌ సమానీ ఈ సందర్భంగా కింగ్‌ సల్మాన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com