8,423 శానిటైజర్‌ బాటిళ్ళ పట్టివేత

- April 08, 2020 , by Maagulf
8,423 శానిటైజర్‌ బాటిళ్ళ పట్టివేత

రస్‌ అల్‌ ఖైమా మునిసిపాలిటీ నిబంధనలకు అనుగుణంగా లేని 8,243 హ్యాండ్‌ శానిటైజర్‌ బాటిళ్ళను సీజ్‌ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో శానిటైజర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా లేని శానిటైజర్ల విక్రయాలకు పాల్పడుతున్నవారిపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో శానిటైర్లను గుర్తించి, సీజ్‌ చేశామని అధికారులు తెలిపారు. బాటిళ్ళలో సరైన మోతాదులో ఆల్కహాల్‌ లేదనీ, రిజిస్టర్‌ కాని సంస్థల పేర్లతో వీటిని తయారు చేశారని అధికారులు వివరించారు. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని శానిటైజర్లను విక్రయిస్తున్నవారిపై కరినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com