ఆయనకు ఇద్దరు... చూసేందుకు పర్మిట్ కావాలట?

- April 08, 2020 , by Maagulf
ఆయనకు ఇద్దరు... చూసేందుకు పర్మిట్ కావాలట?

దుబాయ్:ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్ని నగరాలు పట్టణాలు రాష్ట్రాలు దేశాలు ఇలా ప్రతిచోటా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇలా ప్రజలందరిని ఇంటికే పరిమితం చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ని తగ్గించాలని భావిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే దుబాయ్ లో కూడా రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు యుఏఈ ప్రభుత్వం స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దుబాయ్ ప్రభుత్వం స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా అక్కడి ప్రజలు ఎవరు ఇల్లు దాటి బయటకు రాకూడదు. కేవలం అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకి రాకూడదు అంటూ ప్రభుత్వం సూచించింది.

అయితే ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు విధించినప్పటికీ ఎవరైనా బయటకు రావాలి అనుకున్నప్పుడు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కరోనా కట్టడి చేసేందుకు స్టెరిలైజేషన్ అమలు చేస్తున్న నేపథ్యంలో స్టెరిలైజేషన్ పై ప్రజలకు ఉన్న అనుమానాలను తీర్చేందుకు... ప్రభుత్వం ఒక ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంది.హెల్ప్లైన్ నెంబర్: 800PERMIT (800737648) కి ప్రజలు ఫోన్ చేసినప్పుడు పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు పోలీస్ అధికారులు. ఈ క్రమంలోనే దుబాయ్ కి చెందిన ఓ వ్యక్తి హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసాడు.

ఇక వెంటనే పోలీస్ అధికారి ఫోన్ ఎత్త గా ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు పోలీస్ అధికారి కి నవ్వు ఆగలేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఏమని అడిగాడు అంటారా... సార్ నాకు ఇద్దరు భార్యలు... రెండిళ్లకు తిరగాల్సి ఉంటుంది... మరి ప్రస్తుతం స్టెరిలైజేషన్ లో భాగంగా నేనేమైనా పర్మిషన్ తీసుకోవాలా అంటూ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి పోలీస్ అధికారిని అడిగాడు సదరు వ్యక్తి. ఇక అది ప్రశ్నకు నవ్వుతూ ఇలాంటి సమస్యకు పర్మిట్ పొందకపోవడమె మంచిది అంటూ పోలీస్ అధికారి తెలిపారు . పర్మిట్ కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అంటూ తెలిపిన పోలీస్ అధికారులు... ఈ లెక్కన చూసుకుంటే నువ్వు ప్రతిసారి పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని... అందుకే రెండవ భార్య ను కలవకుండా ఉండడమే మంచి నిర్ణయం అంటూ కాలర్ కు సూచించారు అధికారులు.ఈ పర్మిట్ వివరాల కోసం ఈ వెబ్‌సైట్ https://www.dxbpermit.gov.ae/home లో చూడండి లేదా టోల్ ఫ్రీ నెంబర్  800PERMIT (800737648) కు కాల్ చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com