స్పెయిన్: గత 24 గంటల్లో 757 కరోనా మరణాలు
- April 08, 2020
మాడ్రిడ్ :స్పెయిన్ లో కరోనా వైరస్ మళ్ళీ విజృంభించడం ప్రారంభించింది. వరుసగా రెండో రోజు మరణాల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 757 మంది మరణించారు. దాంతో బుధవారం రెండవ రోజు వరుసగా స్పెయిన్లో రోజువారీ కరోనావైరస్ మరణాల సంఖ్య 2 శాతం పెరిగిందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. దీంతో స్పెయిన్లో కరోనావైరస్ వలన సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 14,555 కు పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం మరణాల సంఖ్యలో రోజువారీ పెరుగుదల బుధవారం 5.7 శాతంగా ఉంది, అంతకు ముందు రోజు 743 మంది మరణించారు అప్పుడు 5.5 శాతం మరణాల రేటు ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే మరణాల సంఖ్యలో రోజువారీ వేగం కొద్దిగా తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలావుంటే కేసులు కూడా 146.690 కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







