ఏపీలో కరోనా వాలంటీర్ పోస్టులు..
- April 09, 2020
అమరావతి: కరోనా మహమ్మారిపై యుద్ధానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ వారియర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రాణాంతక వైరస్‌ను అరికట్టేందుకు కోవిడ్ వారియర్ వాలంటీర్లను నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఏపీలో ఉన్న మెడికల్ కాలేజీలు, ఆయుర్వేద నర్సింగ్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, యునాని, ఇతరత్రా వైద్య సంబంధిత కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కోవిడ్ వారియర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు రెండూ ఒకటి కాదా..
కరోనాను సమర్థవంతంగు ఎదుర్కొనేందుకు కోవిడ్ వాలంటీర్లను నియమించనున్నట్లు ఏపీ కోవిడ్ ప్రత్యేకాధికారి ఎం. గిరిజాశంకర్ తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమంలో నైపుణ్యం కలిగిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, వైద్య సంబంధిత విద్యార్థులు, నర్సుల సేవల్ని క్వారంటైన్ సెంటర్లలో కోవిడ్ వారియర్ వాలంటీర్లుగా వినియోగించుకోనున్నామని చెప్పారు. వారు ఎంపిక చేసుకున్న జిల్లాల్లోనే వాలంటీర్ల సేవలు అందించాల్సి ఉంటుందన్నారు.
కరోనా కష్టకాలంలో మహమ్మారిని అరికట్టేందుకు ఆసక్తి కలిగిన వారు వాలంటీర్లుగా నమోదు చేసుకునేందుకు ఏపీ సర్కార్ ఓ వెబ్ సైట్ ప్రారంభించింది. https://health.ap.gov.in/CVPASSAPP/Covid/VolunteerJobs ఈ వెబ్‌సైట్‌లో కోవిడ్ వారియర్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మెడికల్ సిబ్బంది, ఉత్సాహవంతులైన యువత కూడా వాలంటీర్లుగా నమోదు చేసుకుంటున్నారని వివరించారు. ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చిన అనంతరం వారు కోరుకున్న జిల్లాలోనే సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
కోవిడ్ కష్ట కాలంలో వాలంటీర్లుగా చేసేందుకు ఆసక్తి చూపి ముందుకొస్తున్న వారికి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే ఉద్యోగ నియామకాలలో కోవిడ్ వారియర్ వాలంటీర్లకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







