కరోనా/అమెరికా:11 మంది భారతీయుల మృతి
- April 09, 2020
వాషింగ్టన్:కరోనా మహమ్మారి తో అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 14 వేలమందికి పైగా మృతి చెందారు. బుధవారం ఒక్కరోజే దాదాపు 2 వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఎఫెక్ట్ అమెరికాలో ఉంటున్న భారతీయులపై కూడా పడింది. కఠిన నిబంధనలతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే.. ఇందులో పలువురు కరోనా బారినపడి చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు చికిత్స పొందుతున్నారు.
ఇప్పటివరకు 11 మంది భారతీయులు కరోనాతో చనిపోయినట్లు సమాచారం. వీరిలో 10 మంది న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలకి చెందిన వారు కాగా, ఒక్కరు ఫ్లోరిడాలో నివాసం ఉంటన్న వ్యక్తిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నలుగురు ట్యాక్సీ డ్రైవర్లని తెలిసింది. ఇదిలావుంటే నలుగురు మహిళలు సహా మరో 16 మంది భారతీయులు కరోనా లక్షణాలతో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది న్యూయార్క్లో, ముగ్గురు న్యూజెర్సీలో, మిగిలినవారు టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్నారు. వారంతా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?