కోవిడ్:ఎంపిక చేసిన ఫెడరల్ ఉద్యోగులకు జీతంతో కూడిన సెలవులు
- April 09, 2020
యూఏఈ:కరోనా విపత్తు సమయంలో ఉద్యోగులకు బాసట నిలిచింది యూఏఈ. ఫెడరల్ ఉద్యోగుల కుటుంబ పరిస్థితులను బట్టి జీతంతో కూడా సెలవులను ఇవ్వాలని యూఏఈ కేబినెట్ తీర్మానించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుం. 16 ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఉద్యోగి కావాలంటే సెలవులు పెట్టుకోవచ్చు. ఈ సెలవు కాలానికి జీతంలో ఎలాంటి కోతలు ఉండవు. ఇక ఉద్యోగి భార్య స్వీయ నిర్బంధంలో ఉండి కుటుంబ సభ్యులకు దూరం పాటిస్తున్న పరిస్థితుల్లో పిల్లల వయస్సుతో సంబంధం లేకుండా సెలవులు తీసుకొచ్చు. ఇక ఫెడరల్ ఉద్యోగి భార్య కీలకమైన వైద్య రంగంలో డాక్టర్, నర్స్, పారామెడికల్ తరహా మెడికల్ సేవలు అందిస్తున్నా, నిర్బంధ శిబిరాల్లో(క్వారంటైన్ సెంటర్స్) లో ఎమర్జెన్సీ విధులు నిర్వహిస్తున్నా ఆ ఉద్యోగి పెయిడ్ లీవ్స్ తీసుకోవచ్చు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వేళ సదరు ఉద్యోగి నిత్యావసర సేవల విభాగాల్లో విధులు నిర్వహిస్తుంటే మాత్రం సెలవులు ఇవ్వటం కుదరదని, పని వేళల్లో మార్పులకు మాత్రమే అవకాశం ఉంటుందని కూడా మినిస్ట్రి ఆఫ్ పెడరల్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







