కోవిడ్ 19: కరోనా కట్టడికి శుక్ర, శనివారాల్లో షాపులు మూసివేత

- April 09, 2020 , by Maagulf
కోవిడ్ 19: కరోనా కట్టడికి శుక్ర, శనివారాల్లో షాపులు మూసివేత

దోహా:కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఖతార్ కౌన్సిల్ ఇప్పటికే దేశంలో పలు ఆంక్షలను అమలు చేస్తోంది. ఆంక్షల అమలును విజయవంతంగా కనసాగిస్తున్న ఖతార్ కౌన్సిల్ తాజా మరో నిర్ణయం తీసుకుంది. వైరస్ పై మరింత పకడ్బందీగా పోరాడేందుకు ఇక నుంచి వారాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిషేధించింది. దీంతో ఇక నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో షాపులు మూతపడనున్నాయి. అయితే..ఆహార పదార్ధాలు, క్యాటరింగ్ షాప్స్, ఫార్మసీస్ తో పాటు రెస్టారెంట్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దులాజీజ్ అల్ తని అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు సూచనలు చేశారు. ఇక ఇప్పటివరకు కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కౌన్సిల్ ప్రశంసించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషిని కొనియాడింది. అలాగే వివిధ రంగాల్లోని ఉద్యోగులు, వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, స్టేట్ ఏజెన్సీస్ కరోనా వైరస్ పై పోరాటంలో సమర్ధవంతమైన పాత్ర పోషించారని కౌన్సిల్ ప్రశంసించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com