ట్రంప్‌ ట్వీట్‌..స్పందించిన మోడీ...

- April 09, 2020 , by Maagulf
ట్రంప్‌ ట్వీట్‌..స్పందించిన మోడీ...

హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్ పంపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌కు స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ... కఠిన సమయాల్లో మిత్రులు మరింత దగ్గరవుతారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలోనే భారత్-అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. కోవిడ్ 19పై పోరాటంలో మానవత్తం చాటేందుకు భారత్‌ ముందు ఉంటుందన్నారు. మనమంతా కలిసి కరోనా ఎదుర్కోందాం అంటూ.. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కాగా, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేసేందుకు భారత్ ముందుకు రావడంతో ట్వీట్లతో మోడీని కొనియాడిన ట్రంప్.. మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్ట సమయాల్లో స్నేహితుల మధ్య మరింత సన్నిహత సంబంధాలు అవసరమన్నారు. అమెరికాకు మందులు సరఫరా చేస్తున్నందుకు భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్.. ఈ మేలును ఎప్పటికీ మరిచిపోమన్నారు. పనిలో పనిగా ప్రధాని మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌కు సమర్థ నాయకత్వాన్ని అందించడమే కాకుండా మానవత్వాన్ని చూటుకుంటున్నారని కొనియాడిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com