కువైట్: భారతీయులకు అమ్నెస్టీ పథకం(క్షమాభిక్ష) తేదీల్లో మార్పు
- April 09, 2020
కువైట్:సరైన డాక్యుమెంట్లు లేని ప్రవాసీయులకు కువైట్ ప్రకటించిన క్షమాభిక్ష పథకం లో స్వల్ప మార్పులు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసీయులు ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఉచితంగా సొంత దేశాలకు వెళ్లే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే..ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు సహాయ కేంద్రాలను సంప్రదించేందుకు ప్రత్యేకంగా తేదీలను కూడా కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ కు సంబంధించిన తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. క్షమాభిక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న బంగ్లాదేశీయులు ఏప్రిల్ 11 నుంచి 15 వరకు ఫర్వానియాలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచించింది. అలాగే ఇండియన్స్ 11 ఏప్రిల్ కి బదులు 16 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ మధ్య సహాయ కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలిని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!