అమెరికా:16 వేలు దాటినా కరోనా మరణాలు
- April 10, 2020
అమెరికా:అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.. మరణాల సంఖ్య వేల సంఖ్యలో పెరుగుతోంది. గురువారం జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 16,527 గా నమోదయింది.. గురువారం వరకూ 14 ఐదు వందలు ఉంది. అయితే ఒక్కసారిగా పెరిగాయి. అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ధృవీకరించబడిన కేసుల సంఖ్య 159,937 కు చేరుకుంది.
అంతేకాదు మొత్తం కేసులు 460,967 దాటి.. అరా మిలియన్ కు దగ్గరలో ఉన్నాయి. గురువారం పెరుగుతున్న కరోనా వ్యాప్తిపై అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సమీక్షా సమావేశం నివహించారు. ఈ సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్ స్టేట్స్లో రెండు మిలియన్ పరీక్షలు పూర్తయ్యాయి అని అన్నారు.. అంతేకాదు ఆరు నెలల వరకు విద్యార్థుల రుణ చెల్లింపులు మాఫీ అవుతాయని ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







