కరోనా ఎఫెక్ట్: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

- April 10, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం రేపు (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై ఈ కేబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ పొడిగించే అంశం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ వ్యూహ రూపకల్పన, రాష్ట్రంలోని పేదలు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయం, వ్యవసాయం కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com