తగ్గిన మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌

- April 10, 2020 , by Maagulf
తగ్గిన మొబైల్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌

కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. చాలా మంది ఉద్యోగులు తమ ఇంటి నుంచే వర్క్‌ ఫ్రమ్‌ హోం పనిచేయడం, పిల్లలు, యువత ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటం, వీడియోలు వీక్షించడం, ఆన్‌లైన్‌ కోర్సులు నేర్చుకుంటుండంతో అనూహ్యంగా ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. దీంతో భారత్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌, హోం బ్రాడ్‌బ్యాండ్‌ స్పీడ్‌ వేగం కూడా తగ్గుతున్నది. లాక్‌డౌన్‌తో ఇండ్లళ్లలోనే ప్రజలు ఉండిపోవడంతో ఇంటర్నెట్‌ వాడకం భారీగా పెరుగడంతో డౌన్‌లోడ్‌ భారీగా పడిపోయిందని ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ తాజాగా వెల్లడించింది.

ఫిబ్రవరిలో సరాసరిగా 39.65 ఎంబీపీఎస్‌గా ఉన్న డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఆ మరుసటి నెలకు గాను 35.98 ఎంబీపీఎస్‌కు పడిపోయింది. సరాసరి మొబైల్‌ నెట్‌వర్క్‌ వేగం కూడా 11.83 ఎంబీపీఎస్‌ నుంచి 10.15 ఎంబీపీఎస్‌కు జారుకున్నది. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మొబైల్‌లో హెచ్‌డీ, ఆల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ల ప్రసారాలను రద్దు చేస్తున్నట్లు వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెల్యూలార్‌ నెట్‌వర్క్‌పై అధిక భారం పడకూడదనే ఉద్దేశంలో కేవలం స్టాండర్డ్‌ డెఫినేషన్‌ కంటెంట్‌ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com