గ్లవ్స్, మాస్క్‌ల తయారీ కెపాసిటీని పెంచిన ఒమనీ సంస్థ
- April 11, 2020
మస్కట్: సలాలాహ్ మెడికల్ సప్లయ్స్ మాన్యుఫాక్చరింగ్ (ఎస్ఎంఎస్ఎం), పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్టుగా మాస్కలు, గ్లవ్స్ అలాగే ఇతర మెడికల్ సప్లయ్స్ల తయారీని పెంచుతున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఎస్ఎంఎస్ఎం సీఈఓ అహ్మద్ బిన్ లకీల్ అల్ ఇబ్రహీమ్ మాట్లాడుతూ, 2 మిలియన్ల గ్లవ్స్, 100,000 ఫేస్ మాస్క్‌లు రోజుకి తయారు చేసే సామర్థ్యం తమ సంస్థకు వుందనీ, డిమాండ్ నేపథ్యంలో ఇంకాస్త ఎక్కువగా కూడా తయారు చేస్తామని చెప్పారు. మార్చిలో 2 మిలియన్ ఫేస్ మాస్క్‌లను అందించామనీ, అవసరమైన మెడికల్ సప్లయ్స్ కూడా ఇవ్వగలిగామని ఆయన పేర్కొన్నారు. 2019 నుంచి ఎస్ఎంఎస్ఎం 10 రకాల మెడికల్ గ్లవ్స్‌ని అన్ని రకాల ఫేస్ మాస్కులనూ తయారు చేస్తోంది. సర్ప్లస్ ప్రోడక్ట్స్‌ని ఇతర జీసీసీ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయనున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు