చెట్టినాడ్ ఫిష్ కర్రీ
- January 26, 2016
కావలసిన పదార్థాలు: చేప ముక్కలు: ఐదు లేక ఆరు, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరిగి పెట్టుకోవాలి), టమోటా: ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి), చింతపండు గుజ్జు: టేబుల్ స్పూను, పసుపు: అర టేబుల్ స్పూను, కొత్తిమీర తరుగు: కొద్దిగా, నూనె: తగినంత, మెంతులు: అర టీస్పూను, ఆవాలు: అర టీస్పూను, చిన్న ఉల్లిపాయలు: ఆరు లేక ఏడు, వెల్లుల్లి రెమ్మలు: నాలుగు లేక ఐదు, టమోటా:ఒకటి, కరివేపాకు: కొద్దిగా. మసాలా కోసం: కొబ్బరి పొడి: అరకప్పు, ధనియాల పొడి: టేబుల్ స్పూను, కారం పొడి: టేబుల్ స్పూను,
తయారీ విధానం: ముందుగా మసాలా దినుసులన్నీ మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించి అనంతరం వీటిని కూడా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి మెంతులు, ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, చిన్నఉల్లిపాయ ముక్కలు, టమొటా ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద, ఉల్లిపాయ ముద్ద వేసి కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతున్న సమయంలోనే ఉప్పు, కూడా జతచేసుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను నెమ్మదిగా వేసి మూడు లేక నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి దించేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







