కరోనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- April 11, 2020
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? ఒకవేళ వ్యాపిస్తే దాని ప్రభావం ఎంత దూరం వరకు ఉంటుంది..? నిన్న మొన్నటి దాకా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సైతం కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పడానికి సరైన సాక్ష్యాధారాలేవీ లేవని స్పష్టం చేసింది. కానీ తాజాగా తెర పైకి వచ్చిన ఓ ఆసక్తికర అధ్యయనం.. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందని చెబుతోంది. అయితే గాల్లో అది వ్యాప్తి చెందే దూరం తక్కువేనని వెల్లడించింది.
గాల్లో వ్యాప్తి చెందుతుందా..?
కరోనా వైరస్ గాల్లో వ్యాప్తి చెందుతుందా అన్న అంశంపై చైనా పరిశోధకులు జరిపిన అధ్యయనం తాలుకు వివరాలను యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడిసీ) జర్నల్ 'ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్'లో శుక్రవారం ప్రచురించారు. ఈ పరిశోధన కోసం కోవిడ్-19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఐసోలేషన్ వార్డుల నుంచి ఎయిర్ శాంపిల్స్‌ను సేకరించారు. తాజా పరిశోధనలో గాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని నిర్దారించారు. అయితే కేవలం 4మీ. వరకే అది వ్యాప్తి చెందగలదని తేల్చారు. అంటే,ప్రస్తుతం పాటిస్తున్న 2మీ. సోషల్ డిస్టెన్స్ కంటే మరో 2మీ. ఎక్కువన్నమాట.
పేషెంట్ నుంచి 13 అడుగుల వరకు..
ఐసోలేషన్ వార్డుల్లో ఎక్కువగా ఫ్లోర్ పైనే వైరస్ కేంద్రీకృతమై ఉంటున్నట్టు పరిశోధకులు నిర్దారించారు. గురుత్వాకర్షణ, గాలి ప్రవాహం వల్ల చాలా వైరస్ బిందువులు భూమి పైకి చేరుకుంటాయని చెప్పారు. కరోనా పేషెంట్లకు ఐసీయూలో చికిత్స అందించే మెడికల్ స్టాఫ్ అరికాళ్లకు కూడా వైరస్ అంటుకుంటుందని నిర్దారించారు. బూట్ల నుంచి సేకరించిన సగం వరకు శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. కాబట్టి వైద్య సిబ్బంది బూట్లు కూడా వైరస్ వాహకాలుగా పనిచేసే అవకాశం ఉందన్నారు. కరోనా పేషెంట్ నోటి నుంచి విడుదలయ్యే తుంపరలు గాలి ద్వారా 13 అడుగులు దిగువకు వ్యాపించగలవని నిర్దారించారు. తమ పరిశోధన ప్రకారం కరోనా అనుమానిత వ్యక్తులను హోమ్ ఐసోలేషన్ చేయడం మంచిది కాదని తెలిపారు.
మాస్కుల ధరిస్తే నియంత్రించవచ్చు..
ఇక ముందు నుంచి చెబుతున్నట్టు కరోనా నియంత్రణలో మాస్కు ధరించడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఒక కరోనా రోగి మిల్లీ లీటర్ లాలాజలంలో వందల మిలియలన్ల వైరస్ కణాలు ఉంటాయని చెబుతున్నారు. కేవలం 40-200 వైరస్ సూక్ష్మ కణాలు శరీరంలోకి వెళ్తే చాలు.. అవి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తాయంటున్నారు. కాబట్టి మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలంటున్నారు. తైవాన్,సౌత్ కొరియా,జపాన్ లాంటి దేశాల్లో ఇదివరకు ఇలాంటి అంటువ్యాధులు ప్రబలిన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి.. ఆ దేశాలు పరిశుభ్రత,రక్షణ పట్ల ఎక్కువ శ్రద్ద వహిస్తున్నాయని చెబుతున్నారు.
మాస్కులను తప్పనిసరి చేసిన రాష్ట్రాలు
ఇటు భారత్‌లోనూ ఢిల్లీ,తెలంగాణల్లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాల కోసం లేదా అత్యవసర పరిస్థితుల్లో బయటకొచ్చేవారు తప్పనిసరి మాస్కులు పెట్టుకోవాలని ఆదేశించారు. దేశంలో చాలా చోట్ల క్లస్టర్ జోన్లను గుర్తించి కంటైన్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో అధికారులే నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు. తద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చునని భావిస్తున్నారు. ఇక దేశంలో లాక్ డౌన్ పొడగింపుపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ శనివారం(ఏప్రిల్ 11) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత లాక్ డౌన్ పీరియడ్ పొడగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?