మస్కట్:ప్రాధాన్యత ప్రకారమే తరలింపు..భారతీయుల విజ్ఞప్తిపై రాయబార కార్యాలయం స్పష్టత
- April 12, 2020
మస్కట్:అత్యవసరంగా భారత్ కు వెళ్లాలనుకునే వారు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వేచి చూడాల్సిందేనని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం వరకు అంతా వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది. తాము అత్యవసరంగా భారత్ వెళ్లాలంటూ రాయబార కార్యాలయానికి ఎక్కువ సంఖ్యలో ఈ మేల్స్, ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఒమన్ భారత రాయబారి మును మహవర్ ఈ ప్రకటన చేశారు. అయితే..విమానాల సర్వీసులు పునరుద్దరించిన వెంటనే అత్యవసరం ఉన్నవారికే మొదటి ప్రధాన్యం ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ వెళ్లాలనుకునే వారు తమ వివరాలను పొందుపర్చేందుకు ప్రత్యేకంగా గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేసింది. అందులో సొంత దేశానికి వెళ్లాలనుకుంటున్న వారు తమ కాంటాక్ట్ నెంబర్లతో పాటు ఏ అవసరం కారణంగా వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొవాలి. విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత అత్యవసరం అనుకున్న వారికి తొలి ప్రధాన్యత క్రమంలో జర్నీ ఏర్పాట్లు చేయనున్నట్లు మును మహవర్ స్పష్టం చేశారు. అయితే..ప్రయాణం ఎప్పుడు అనే విషయంపై రాయబార కార్యాలయాన్ని పదే పదే సంప్రదించాల్సిన అవసరం లేదని, విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రధాన్యత క్రమాన్ని బట్టి మేమే వాళ్లను సంప్రదిస్తామని కూడా ఆయన తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







