మస్కట్:రెండు హ్యాండ్ శానిటైజర్ బ్రాండ్లను నిషేధించిన ఒమన్
- April 12, 2020మస్కట్:కరోనా వైరస్ సీజన్ లో హ్యాండ్ శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. వైరస్ నుంచి రక్షించుకోవాలంటే పదే పదే చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు చెబుతుండటంతో జనం శానిటైజర్లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇదే అదనుగా నాసిరకం శానిటైజర్ బ్రాండ్లు కూడా మార్కెట్లోకి వచ్చిపడుతున్నాయి. అలాంటి నకిలీ బ్రాండ్లపై ఓ కన్నేసి పెట్టిన ఒమన్ ప్రభుత్వం లేటెస్ట్ రెండు హ్యాండ్ శానిటైజర్ బ్రాండ్లపై నిషేధం విధించింది. పర్ఫెక్ట్, క్లీన్ టచ్ హ్యాండ్ శానిటైజర్ జల్ అనే రెండు బ్రాండ్ల అమ్మకాలను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. ఈ రెండు బ్రాండ్లు తయారీలో తగిన నాణ్యాతా ప్రమాణాలు పాటించలేదన్నది ఒమన్ వాదన. ఈ రెండు బ్రాండ్ల శానిటైజర్ లు శరీరంపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని, తలనొప్పి, స్కిన్ ఇరిటేషన్, బడలికగా లక్షణాలు కనిపిస్తున్నాయని ఒమన్ ప్రభుత్వం చెబుతోంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!