కువైట్:వీసా నిబంధనలు పాటించని ప్రవాసీయుల కేంద్రాలను పరిశీలించిన ఉప ప్రధాని
- April 12, 2020
కువైట్:నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ అనస్ అల్ సలెహ్ పరిశీలించారు. కబద్ లోని శిబిరాలను పరిశీలించిన ఆయన..అక్కడి వసతులు, భద్రత ఏర్పాట్లు, శిబిరాల్లోని ప్రశాసీయుల పరిస్థితులను పరిశీలించారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన జ్లీప్ అల్-షోయౌఖ్ జిల్లాలోని ముందస్తు భద్రత చర్యలను ఆయన తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీయటంలో భాగంగా ఆయా ప్రాంతంలో పర్యటించారు. లాక్ డౌన్ విధించేందుకు అవసరమైన పరిస్థితులు, భద్రత ఏర్పాట్ల సన్నద్దత గురించి ఆయన అధికారులను అడిగితెల్సుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







