కోవిడ్ 19:ప్రవాసీయుడు తప్పించుకున్నాడనే పుకార్లను కొట్టిపారేసిన ఒమన్
- April 12, 2020
ఒమన్ లోని ఓ ప్రవాసీయుడు మస్కట్ నుంచి విలాయత్ మన్కుల్ కు పారిపోయాడనే పుకార్లను ఒమన్ ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ఘటనలేవి చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రవాసీయుడు పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సమాచార కేంద్రం వివరణ ఇచ్చింది. మస్కట్ నుంచి అల్ ధహిరా గవర్నేట్ లోని విలాయత్ యన్కుల్ కు ప్రవాస కార్మికుడు తప్పించుకొని పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆన్ లైన్ ద్వారా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని జీసీసీ కోరింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







