బహ్రెయిన్:కార్మికుల నివాస వెసులుబాట్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలన
- April 15, 2020
మనామా:కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో మొదట్నుంచి సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్న బహ్రెయిన్..ఇప్పుడు ప్రవాస కార్మికులు ఉండే ప్రాంతాలపై మరింత దృష్టి సారించింది. కరోనా నియంత్రణకు సామాజిక దూరం అత్యవసరం కావటంతో ప్రవాస కార్మికులు ఒక్కో గదిలో ఎంత మంది ఉంటున్నారో ఆరా తీస్తోంది. సామాజిక దూరం పాటించేలా తగిన పరిస్థితులు ఉన్నాయా? తగిన సౌకర్యాలు లేకుంటే వారికి ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే కోణంలో పరిశీలన చేస్తోంది. ఇందులోభాగంగా బహ్రెయిన్ అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలిఫా సూచనల మేరకు నార్తర్న్ గవర్నర్ అలీ బిన్ అబ్దుల్ హుస్సేన్ అల అస్ఫూర్ ప్రవాస కార్మికుల క్యాంప్ లో జన సంద్రతను పరిశీలిచేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఆయనతో పాటు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ ప్రతినిధులు, నార్తర్న్ పోలీసులు కూడా పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రవాస కార్మికులతో గవర్నర్ అలీ బిన్ అబ్దుల్ మాట్లాడారు. కార్మికుల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన పోలీసులను ఆయన ప్రశంసించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు