కోవిడ్ 19ః సరిహద్దులో కువైట్ అలర్ట్..ప్రతి వాహనం శానిటైజ్ తర్వాతే అనుమతి
- April 15, 2020
కువైట్:కువైట్ ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. వైరస్ ఉద్ధృతికి అవకాశం ఉండే అన్ని ప్రాంతాల్లో క్రిమి సంహారక (శానిటైజ్) చర్యలు చేపడుతున్నారు. ఇక ఇతర దేశాల నుంచి రోడ్డు మార్గంలో వచ్చే వాహనాలు, ట్రక్కుల విషయంలోనూ కువైట్ ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సరిహద్దులోనే వాటిని శానిటైజ్ (క్రిమి సంహారక చర్య) చేసి ఆ తర్వాతే దేశంలోకి అనుమతి ఇస్తున్నారు. ఇందుకోసం సరిహద్దు చెక్ పోస్టు దగ్గర కువైట్ అగ్నిమాపక శాఖ సరిహద్దులోని చెక్ పోస్టులు, విమానాశ్రయాల దగ్గర క్రిమిసంహారక స్టాండ్లతో జెట్టింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది. ప్రతీ వాహనం ఈ క్రిమిసంహారక స్టాండ్ల ద్వారా వెళ్లగానే అందులోనే రసాయనాలతో వాహనం మొత్తాన్ని స్ప్రె చేస్తారు. పూర్తిగా స్ప్రె చేసిన తర్వాత కువైట్ లోకి అనుమతిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు