బార్బర్స్, ప్రైవేట్ ట్యూటర్స్‌కి అనుమతి లేదు
- April 15, 2020
సౌదీ అరేబియా: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో కొన్ని మార్గదర్శకాల్ని కింగ్డమ్లో విడుదల చేశారు. డైరెక్ట్ కాంటాక్ట్, గేదరింగ్, వెయిటింగ్, కామన్ టూల్స్ వినియోగం వంటివాటిని అరికట్టేందుకు ఈ మార్గదర్శకాల్ని రూపొందించడం జరిగింది. బార్బర్స్, విమెన్స్ బ్యూటీషియన్స్, గ్యాస్ సేల్స్‌మెన్, సేల్స్ రిప్రెజెంటేటివ్స్ మరియు ప్రైవేట్ ట్యూటర్స్‌ని ఇళ్ళల్లోకి వెళ్ళేందుకు అవకాశం లేకుండా ఈ మార్గదర్శకాల్ని విడుదల చేయడం జరిగింది. కాగా, ఓ సౌదీ సిటిజన్ తన కుమారుడికి ట్యూషన్ చెప్పే వ్యక్తి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ, ప్రైవేట్ కాంటాక్ట్ లేకుండా చూస్తూ, ఆన్లైన్ ద్వారా ట్యూషన్ చెప్పిస్తున్నట్లు వెల్లడించారు. మరో సౌదీ సిటిజన్ మాట్లాడుతూ, తన ఇంట్లో పనికి వచ్చే వర్కర్ విషయంలో జాగ్రత్తగా వుంటున్నామనీ, పని అయిపోయాక ఆ వ్యక్తి తిరిగిన ప్రాంతాన్ని స్టెరిలైజ్ చేస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?