ఇండియన్ కమ్యూనిటీని ఆదుకుంటాం: భారత రాయబారి సయీద్
- April 16, 2020
రియాద్: కరోనా వైరస్ నేపథ్యంలో సౌదీ అరేబియాలో వుంటోన్న భారత కమ్యూనిటీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని సౌదీలో భారత రాయబారి డాక్టర్ ఔసాఫ్ సయీద్ చెప్పారు. సౌదీ అరేబియాలోని భారత జర్నలిస్టులతో ఈ మేరకు వీడియో సమావేశం నిర్వహించారు రాయబారి సయీద్. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సౌదీలో భారతీయుల పరిస్థితి గురించి తెలుసుకుంటోందనీ, ఎంబసీ ఓ డెడికేటెడ్ హెల్ప్‌లైన్ నెంబర్ని కూడా అందుబాటులోకి తెచ్చిందని వివరించారాయన. 00966546103992 (వాట్సాప్‌తో సహా) నెంబర్ ద్వారా తమ సమస్యల్ని ఎంబసీ దృష్టికి తీసుకురావచ్చు ఇండియన్ కమ్యూనిటికీ సంబంధించినవారెవరైనా. కాగా, ఇ-మెయిల్ ద్వారా కూడా ఎంబసీని సంప్రదించే అవకాశం వుంది. గల్ప్Û రీజియన్‌లో భారత్‌కి సౌదీ అరేబియా అత్యంత ముఖ్యమైన దేశమనీ, ఇక్కడ భారతీయుల సంఖ్య చాలా ఎక్కువనీ, వారి భద్రత విషయంలో భారత ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని సయీద్ పేర్కొన్నారు. కింగ్‌డమ్‌లోని ప్రధానమైన 100 కంపెనీలతో ఎంబసీ టచ్‌లో వుంది. అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగుల విషయమై ఎప్పటికప్పుడు వాకబు చేస్తోంది. ఇండియన్ డాక్టర్స్ ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా, భారత వలసదారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వాలంటీర్లు కూడా ఫుడ్ మరియు మెడిసిన్స్‌ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







