ఎలక్ట్రానిక్‌ విధానంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొడిగింపు

- April 17, 2020 , by Maagulf
ఎలక్ట్రానిక్‌ విధానంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొడిగింపు

రియాద్‌: డ్రైవింగ్‌ లైసెన్సుల పొడిగింపు ని ‘అబ్‌షెర్‌’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్‌ విధానంలో పొడిగింపు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. వాహన యజమానులు - సిటిజన్స్‌ అలాగే నివాసితులకి  ఈ విధానం వర్తిస్తుంది. అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో కర్‌ఫ్యూ కొనసాగుతున్న దరిమిలా, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, వాహనాల పీరియాడిక్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్టిఫికెట్‌ ఫర్‌ రెన్యూయింగ్‌ వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్న విషయం విదితమే. ఇప్పుడు అది కూడా ఎలక్ట్రానిక్‌ విధానం ద్వారా చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com