కోవిడ్ 19: కోలుకున్న సామాజిక కార్యకర్త నసీర్..ఆస్పత్రి సిబ్బంది గౌరవ వందనం

- April 18, 2020 , by Maagulf
కోవిడ్ 19: కోలుకున్న సామాజిక కార్యకర్త నసీర్..ఆస్పత్రి సిబ్బంది గౌరవ వందనం

దుబాయ్:దుబాయ్ లో ఉంటున్న భారత సామాజిక కార్యకర్త నసీర్ వతనపల్లి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దుబాయ్ లోని ఓ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినకు అక్కడి సిబ్బంది గౌరవ వందనం సమర్పించి ఆస్పత్రి నుంచి విడ్కోలు పలికారు. కేరళా ప్రాంతానికి చెందిన నసీర్ కొన్నెళ్లుగా దుబాయ్ లోనే ఉంటూ..ఇక్కడి భారత కాన్పులేట్ కార్యాలయంలో కలిసి ప్రవాసీయులకు సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అనారోగ్యంతో మృతి చెందిన ప్రవాస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేరవేయటంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. భారత్కు తరలించలేని పరిస్థితులు నెలకొంటే అక్కడే అంత్యక్రియలు నిర్వహించటంలోనూ ముందుంటారు. అలాగే ప్రవాస భారతీయ కుటుంబాలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తు సేవ చేస్తున్నారు. అయితే..ఏప్రిల్ 6న ఆయనకు వైరస్ సోకటంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తర్వాత కోలుకోవటంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

 ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు తనను బాగా చూసుకున్నారని, వారి సేవలను మరువలేనివని అభిప్రాయపడ్డారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాస్కులు, కళ్ల అద్దాలు ధరించి కొన్ని గంటల పాటు నిరంతరాయంగా రోగులకు సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. కరోనా వైరస్ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మిగిలిన ఇన్ఫెక్షన్ రోగాల వంటిదే కరోనా అని అన్నారు. అలాగని నిర్లక్ష్యం కూడా చేయకూడదని హెచ్చరించారు నసీర్. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, ఇక తిరిగిన తన విధుల్లో చేరబోతున్నానని ప్రకటించారు. అలాగే తన అవసరం ఉన్న ప్రతీ చోట సహాయ కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. ఇప్పటికే తాను వాట్సాప్, జూమ్ యాప్స్ ద్వారా వాలంటీర్లు, అధికారులతో టచ్ లో ఉన్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com