యూఏఈ:నిరాధారమైన వార్తలు ప్రచారం చేస్తే Dh20,000 జరిమానా
- April 18, 2020
యూఏఈ:కరోనా వైరస్ నేపథ్యంలో అసత్య ప్రచారాలకు, నిరాధారమైన వార్తల కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్న యూఏఈ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆరోగ్య శాఖకు సంబంధించి ఏలాంటి సమాచారాన్నైనా సరైన అధారాలు లేకుండా, అధికారులు ధృవీకరించకుండా ప్రచురితం చేసినా, ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని యూఏఈ ప్రభుత్వం హెచ్చరించింది. నిరాధారమైన ఆరోగ్య సమాచారాన్ని ప్రచురిస్తే Dh20,000 జరిమానా విధించనుంది. ఈ మేరకు యూఏఈ మంత్రి మండలి తీర్మానానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని కూడా మంత్రిమండలి స్పష్టం చేసింది. చివరకు అధికారులు కూడా ఆరోగ్యపరమైన సమాచారం విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలని, అసంబద్ధమైన ప్రకటనలు చేస్తే అధికారులకు కూడా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







