మస్కట్ : పవిత్ర రమదాన్ మాసంలో మాడైన్ అధ్వర్యంలో సరుకుల ఉచిత పంపిణి
- April 19, 2020
మస్కట్:పవిత్ర రమదాన్ మాసంలో తక్కువ ఆదాయ వర్గాలను ఆదుకునేందుకు మాడైన్ సంస్థ ఉచిత సరుకుల పంపిణీ చేపట్టింది. మస్కట్ తో పాటు దేశంలోని అన్ని గవర్నరేట్ పరిధిలో ఈ వారం సరుకులను పంపిణీ చేయబోతోంది. మేడ్ ఇన్ ఒమనీ ప్రచారంలో చొరవ తీసుకోవడంలో భాగంగా కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని మాడైన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఒమనీ కంపెనీలు, ఫ్యాక్టరీల సహకారంతో వివిధ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన విరాళాలను కలిపి ప్రజలకు అవసరమైన సరుకులను ఇప్పటికే కొనుగోలు చేశారు. దార్ అల్ అట్టా అసోసియేషన్ ఆధ్వర్యంలో పనిచేసే ఎష్రకత్ అమల్ బృంద సహకారంతో మాడైన్ సోషల్ రెస్సాన్సిబులిటీ టీం ఇప్పటికే పంపిణీ చేయాల్సిన సరుకులతో బాక్సులను సిద్ధం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారికీ ఈ రమదాన్ గిఫ్ట్ బాక్సులను అందించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?