కోవిడ్-19: ఇరాన్‌ను అధిగమించిన టర్కీ
- April 19, 2020
టర్కీ:మధ్య ఆసియాలో కరోనా సోకిన దేశాల్లో టర్కీ.. ఇరాన్‌ను అధిగమించింది. ప్రస్తుతం ఇక్కడ 82 వేల 329 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇరాన్ లో 80 వేల పాజిటివ్ కేసులు ఉన్నాయి. టర్కీలో గత 24 గంటల్లో దేశంలో 3 వేల 783 కొత్త కేసులు నమోదు కాగా, 121 మంది మరణించారు. మరోవైపు దేశంలో ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 1890 మంది మరణించారు అని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా శనివారం చెప్పారు.
కరోనావైరస్ నుండి ఇప్పటివరకు మొత్తం 10,453 మంది కోలుకున్నారని, గత 24 గంటల్లో 40,520 మందికి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచి మరో 15 రోజులు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







