జెడ్డా:షాపుల్లో పరిశుభ్రతపై జెడ్డా మున్సిపాలిటీ తనిఖీలు
- April 19, 2020
జెడ్డా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రతకు అధిక ప్రధాన్యం ఇస్తోంది జెడ్డా మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిశుభ్రత పాటిస్తున్నారా? లేరా? అనేది ఎప్పటికప్పుడు హెల్త్ ఇన్స్ పెక్టర్ ల పర్యవేక్షణలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు 1,240 చోట్ల ప్రజా ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు జెడ్డా మున్సిపాలిటీ తమ పరిధిలోని సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 419 కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. వైరస్ ను నియంత్రించేందుకు జెడ్డా మున్సిపాలిటీ తన పరిధిలో వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని పలు పబ్లిక్ ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్రిమిసంహరక ఛాంబర్లను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు