దుబాయ్ లో చిక్కుకున్న సంజయ్ దత్ కుటుంబం
- April 19, 2020
ముంబయి:ఒంటరితనం.. ప్రియమైన వారిని బాగా గుర్తుచేస్తుంది. ఇంతకు ముందు చాలా సార్లు ఒంటరిగా ఉండ వలసి వచ్చినా.. ఇప్పుడు ఈ ఒంటరి తనం మరింత బాధిస్తుంది అని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వాపోతున్నారు. సంజయ్ భార్య మాన్యతా దత్, పిల్లలు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తను ఒక్కడే ముంబైలో ఉన్నాడు. లాక్డౌన్ కారణంగా వాళ్లు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు.
భార్య పిల్లలు దగ్గరలేదనే విషయం బాధించినా టెక్నాలజీ వల్ల వారిని రోజులో అనేక సార్లు చూస్తూ మాట్లాడగలుగుతున్నా. అందుకు టెక్నాలజీకి ధన్యవాదాలు చెప్పాలి అని సంజయ్ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌లో తెలిపారు. కరోనా మనకు జీవితం విలువని, ఒంటరి తనం బాధని తెలుపుతోంది. ప్రియమైన వారితో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేస్తుంది. వాళ్లు అక్కడ సేఫ్‌గానే ఉన్నారని తెలిసినా మనసు ఆందోళన చెందుతూనే ఉంది అని సంజయ్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







