జెడ్డా:షాపుల్లో పరిశుభ్రతపై జెడ్డా మున్సిపాలిటీ తనిఖీలు

- April 19, 2020 , by Maagulf
జెడ్డా:షాపుల్లో పరిశుభ్రతపై జెడ్డా మున్సిపాలిటీ తనిఖీలు

జెడ్డా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిశుభ్రతకు అధిక ప్రధాన్యం ఇస్తోంది జెడ్డా మున్సిపాలిటీ. మున్సిపాలిటీ పరిధిలోని పలు దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిశుభ్రత పాటిస్తున్నారా? లేరా? అనేది ఎప్పటికప్పుడు హెల్త్ ఇన్స్ పెక్టర్ ల పర్యవేక్షణలో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు 1,240 చోట్ల ప్రజా ఆరోగ్య సంరక్షణకు పాటించాల్సిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ ను కట్టడి చేసేందుకు జెడ్డా మున్సిపాలిటీ తమ పరిధిలోని సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 419 కర్ఫ్యూ  నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.  వైరస్ ను నియంత్రించేందుకు జెడ్డా మున్సిపాలిటీ తన పరిధిలో వీలైనన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. నగరంలోని పలు పబ్లిక్ ప్రదేశాలు, ప్రభుత్వ భవనాలు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ క్రిమిసంహరక ఛాంబర్లను ఏర్పాటు చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com