కోవిడ్ 19: కార్మికుల తరలింపుపై దుబాయ్ పోలీసుల బ్రేక్..చెక్ పోస్టుల ఏర్పాటు
- April 20, 2020
దుబాయ్:కరోనా వైరస్ కట్టడికి కార్మికుల కదలికలపై ఆంక్షలు విధించిన దుబాయ్ ఎమిరాతి అధికారులు..నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దుబాయ్, షార్జా ఎమిరాతి సరిహద్దుల్లో రెండువైపుల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక ఎమిరాతి నుంచి మరో ఎమిరాతికి నిబంధనల విరుద్ధంగా కార్మికుల తరలిస్తుండటంతో తనిఖీలను ముమ్మరం చేశారు. అంతేకాదు..ప్రైవేట్ కార్లలో దుబాయ్, షార్జా మధ్య కార్మికులను తరలిస్తున్న ఇద్దరు కారు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో దుబాయ్ లో నివసించే కార్మికులు ఎమిరాతి పరిధి దాటి వెళ్లొద్దని, అలాగే ఇతర ఎమిరాతిలను అనుమతించేది లేదని ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినా..దుబాయ్, షార్జా మధ్య కార్మికులను తరలిస్తున్నారనే సమాచారంతో షార్జా పోలీసులు సమన్వయం చేసుకుంటూ తనిఖీలు చేపడుతున్నామని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ తెలిపారు. ప్రతి బస్సును చెక్ చేయాల్సింది ఆదేశించామని అన్నారు.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







