కోవిడ్ 19: మస్కట్ లో లాక్ డౌన్ పొడిగింపు
- April 21, 2020
మస్కట్:కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మస్కట్ లో లాక్ డౌన్ నిబంధనలను పొడిగిస్తూ సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది. మే 8 వరకు గవర్నరేట్ పరిధిలో ప్రస్తుత భద్రత ఏర్పాట్లు, చెక్ పోస్టు దగ్గర తనిఖీలు కొనసాగుతాయని కమిటీ స్పష్టం చేసింది. వైరస్ ప్రాబల్యం తగ్గకపోవటం వల్లే లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కోవిడ్ 19 నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ వెల్లడించింది. మే 8 శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. ఇదిలాఉంటే భౌతిక దూరం పాటించేందుకు రమాదాన్ మాసంలో ఎవరూ సామూహిక ప్రార్ధనలు నిర్వహించొద్దని కూడా సుప్రీం కమిటీ సూచించింది. అలాగే ఇఫ్తార్ విందు తరహా కర్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







