బహ్రెయిన్‌కి కొత్త భారత రాయబారి
- April 21, 2020
మనామా:అతి త్వరలో బహ్రెయిన్‌కి కొత్త భారత రాయబారి ఎంపిక కానున్నారు. మూడు నెలలుగా ఈ పదవి ఖాళీగా వుంది. మూడు నెలల క్రితం వరకూ బహ్రెయిన్‌లో భారత రాయబారిగా అలోక్ కుమార్ సిన్హా పనిచేశారు. జనవరి 30న ఆయన పదవీ విరమణ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నియామకం కాస్త ఆలస్యమయినట్లు తెలుస్తోంది. కాగా, పియుష్ శ్రీస్తవ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో శ్రీవాస్తవ 1998లో చేరారు. జర్మనీ, భూటాన్, నేపాల్ వంటి దేశాల ఇండియన్ ఎంబసీల్లో పలు కీలక పదవుల్లో పనిచేశారాయన. ఘనా ఇండియన్ హై కమిషన్‌కి సంబంధించి పొలిటికల్, కమర్షియల్, ఎకనమిక్ కో-ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ మరియు మీడియా విభాగాల్లో పనిచేశారు. ఇండియా పొరుగు దేశాలు అలాగే సౌత్ ఈస్ట్ ఏసియా మరియు పసిఫిక్ దేశాలపై ఆయనకు అవగాహన వుంది. ఎకనమిక్, డిప్లమసీ విభాగాల్లో ఆయన నిపుణుడు. మెటీరియల్స్ మరియు మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో ఐఐటీ కాన్పూర్ నుంచి ఎంటెక్ చదివారు శ్రీవాస్తవ.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







