యూఏఈ:నకిలీ ఫేస్ మాస్కులు, శానిటైజర్లు అమ్ముతున్న ప్రవాసీయుడి అరెస్ట్
- April 21, 2020
యూఏఈ :నకిలీ ఫేస్ మాస్కులు, క్రిమి సంహారక రసాయనాలు(శానిటైజర్స్)ను అమ్ముతున్న ఏసియన్ వ్యక్తిని షార్జా మున్సిపాలిటీ అధికారులు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. అతని నుంచి 1,800 నకిలీ శానిటైజర్లు, వెయ్యి మాస్కులు, 200 బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. షార్జా మున్సిపాలిటి పరిధిలోనే ఉండి ప్రవాసీయుడు తన ఇంట్లో ఓ గదిని స్టోర్ రూంగా మార్చుకొని ఈ నకిలీ ఐటమ్స్ ని మార్కెట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫేక్ మాస్కులు, శానిటైజర్లను రవాణా చేసేందుకు ఇంటి ముందు బాక్సులతో అతను సిద్ధంగా ఉన్న సమయంలోనే మున్సిపాలిటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతని నుంచి బాక్సులను స్వాధీనం చేసుకొని వెంటనే పోలీసులకు, ఎమిరాతికి చెందిన ఆర్ధిక అభివృద్ధి విభాగం అధికారులకు సమాచారం అందించారు. నకిలీ సామాగ్రి మార్కెట్ చేస్తున్న ఆరోపణలపై అతనికి భారీగా జరిమానా విధించారు. అలాగే అక్రమ రవాణాకు వాహనాన్ని ఉపయోగించటం, ఇంటిని స్టోర్ రూంగా వాడుకున్నందుకు అదనంగా ఫైన్ విధించారు. ప్రజలకు హాని కలిగించే ఇలాంటి చర్యలను తాము అసలు ఉపేక్షించబోమని అధికారులు హెచ్చరించారు. అదీ కూడా ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిని కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







