యూఏఈ: వివక్ష, విద్వేషపూరిత ప్రచారంపై కఠిన చర్యలు..ప్రవాస భారతీయులకు హెచ్చరిక

- April 21, 2020 , by Maagulf
యూఏఈ: వివక్ష, విద్వేషపూరిత ప్రచారంపై కఠిన చర్యలు..ప్రవాస భారతీయులకు హెచ్చరిక

యూఏఈ:కరోనా వైరస్ వ్యాప్తికి, ముస్లింలకు ముడిపెడుతూ ఇటీవల జరుగుతున్న ప్రచారంపై యూఏఈలోని భారత రాయబారి పవన్ కుమార్ తప్పుబట్టారు. ఇలాంటి చర్యలు భారత నైతికతకు, చట్టాలకు కూడా విరుద్ధమని గుర్తుచేశారు. తబ్లిగీ జమాత్ తర్వాతే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం పెరిగిందని గల్ఫ్ కంట్రీస్ లోని ప్రవాస భారతీయులు బలంగా విశ్వసిస్తున్నారు. అంతేకాదు..సోషల్ మీడియాలో ఇదే అంశంపై వివక్ష పూరిత ప్రచారానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రవాస భారతీయులు ఎవరూ ఓ వర్గాన్ని ఉద్దేశించి వివక్ష, విద్వేష ప్రచారాలు చేయొద్దని సూచించింది. యూఏఈ చట్టాల ప్రకారం ఇస్లాం మతానికి వ్యతిరేకంగా విద్వేశ ప్రచారాం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని భారత రాయబారి పవన్ కుమార్ గుర్తు చేశారు. అంతేకాదు..ప్రధాని మోదీ కార్యాలయం ట్వీట్ ను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. 'కరోనా వైరస్ కు జాతి, మతం, కులం, రంగు, దేశం, సరిహద్దు అనే బేధాలు లేవు. అది ఎవరి మీద అయినా దాడి చేస్తుందనే నిజాన్ని గ్రహించి అందరూ సోదర భావంతో మెలగాలి' అని ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసిన విషయం తెలిసింది.

గల్ఫ్ దేశాల చట్టాలు ఇస్లాంను కించపరిచేలా లేదా వ్యతిరేకించేలా ఎలాంటి చర్యలను, ప్రచారాన్ని సహించవు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రవాస భారతీయులు వివక్ష ప్రచారానికి పాల్పడకుండా ఉంటడం ఎంతో శ్రేయస్కరం. ఒక్క మేసేజ్ ఫార్వర్డ్ చేసిన అది పీకల మీదకు తెస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇటీవలి కాలంలో ఇలా విద్వేశ ప్రచారం చేసి కొందరు ప్రవాస భారతీయులు ఉద్యోగం కొల్పోయారు. జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. శిక్ష తర్వాత వారిపై దేశబహిష్కరణ కూడా తప్పదు. ఈ మధ్యే దుబాయ్ లో ఓ చీఫ్ అకౌంటెంట్ తబ్లిగీ జమాత్ ను నిందిస్తూ ఇస్లాం కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో  పోస్ట్ చేసినందుకు అతని ఉద్యోగం ఊడింది. గత నెలలో దుబాయ్ లోని ఓ రెస్టారెంట్ లో చీఫ్ చెఫ్ గా పని చేస్తున్న వ్యక్తి పౌర సవరణ బిల్లుపై ఢిల్లీకి చెందిన విద్యార్ధిని రేప్ చేస్తానని సోషల్ మీడియాలో బెదరించటంతో అతను ఉద్యోగం కొల్పోయాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com