దుబాయ్:నగదు బదిలీ, మెయింటనెన్స్ సర్వీసులకు లాక్ డౌన్ నుంచి పాక్షిక మినహాయింపు
- April 22, 2020
దుబాయ్:లాక్ డౌన్ నిబంధనల నుంచి విడత వారీగా కొన్ని రంగాలకు మినహాయింపు ఇస్తున్నారు దుబాయ్ అధికారులు. ఇటీవలె మాంసం, కూరగాయలు, టీ, స్వీట్ షాపులకు సడలింపు ఇచ్చిన అధికారులు తాజాగా..నగదు బదిలీ ఆఫీసులు, ఇళ్లలో మెయింటనెన్స్ సర్వీస్ రంగాలకు సంబంధించి పాక్షిక మినహాయింపులను ప్రకటించింది. ఇక నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగదు బదిలీ ఆఫీసులు తెరిచిఉంచేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే బిల్డింగ్ నిర్వహణ, ఏసీ, కూలింగ్ ఈక్విప్ మెంట్ రిపేర్ సర్వీసులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో రాత్రి 8 తర్వాత కూడా సర్వీసు అందించవచ్చని సూచించింది. అయితే..ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటంతో పాటు సామాజిక దూరాన్నిపాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష