మాల్‌.బిహెచ్‌ ప్లాట్‌ఫామ్ ని ప్రారంభించిన ఇంటీరియర్‌ మినిస్ట్రీ

- April 24, 2020 , by Maagulf
మాల్‌.బిహెచ్‌ ప్లాట్‌ఫామ్ ని ప్రారంభించిన ఇంటీరియర్‌ మినిస్ట్రీ

మనామా: మినిస్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, కామర్స్‌ అండ్‌ టూరిజం జాయెద్‌ ఆర్‌ అల్‌ జయానీ నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ కామర్స్‌ అండ్‌ టూరిజం (ఎంఓఐసిటి), మాల్‌.బిహెచ్‌ ప్లాట్‌ఫామ్ ని ప్రారంభించింది. లైసెన్స్‌డ్‌ కమర్షియల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఇ-కామర్స్‌ యాక్టివిటీస్‌ని బహ్రెయిన్‌ వ్యాప్తంగా నిర్వహించేందుకు వీలుగా ఈ ప్లాట్‌ఫామ్ ని రూపొందించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ ప్లాట్‌ఫామ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని లైసెన్స్‌డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ప్లాట్‌ఫామ్ నుంచి తమ ప్రోడక్ట్స్‌ని విక్రయించడానికి వీలు కలుగుతుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎంఎఎల్‌ఎల్‌.బిహెచ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాల్సిందిగా ఆసక్తి వున్న ఎంటర్‌ప్రైజెస్‌, ఎస్‌ఎంఈలకు మినిస్ట్రీ సూచించింది. 17359008 నెంబర్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com