ముస్లింలకు మోదీ శుభాకాంక్షలు..
- April 26, 2020
ఢిల్లీ:ముస్లింలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్-19 పరిస్థితుల మధ్య రంజాన్‌ను జరుపుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు ఉదయం 11గంటలకు మన్‌కీబాత్ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కట్టడి చర్యలు, లాక్డౌన్ అమలుపై ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈద్‌కు ముందే కరోనా మహమ్మారి ఓడిపోవాలని ప్రార్థించానన్నారు. అలాగే.. తీర్థంకర స్వామి రిషభదేవ పవిత్ర వార్షికోత్సవం, బసవ వార్షికోత్సవం సందర్భంగా లింగాయత్ సమాజానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై యుద్ధం కొనసాగుతోందని, భారత్ ప్రజలు ఐకమత్యంతో చేస్తున్న పోరాటాన్ని యుద్ధాన్ని ప్రపంచ గమనిస్తోందని ఆయన అన్నారు. మనం సరైన పద్ధతిలోనే కరోనాపై యుద్ధం చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. కరోనాపై ప్రతీ పౌరుడు ఒక సైనికుడిలా పోరాడుతున్నాడని అన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు వైద్యులు, నర్సులు రాత్రింబవళ్లు వైద్యసేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







