స్వదేశానికి వెళ్లాలనుకునే వారి జాబితా సిద్ధం చేయనున్న భారత రాయబార కార్యాలయం
- April 28, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే..ఎప్పుడు, ఎంతమందిని అనే దానిపై స్పష్టత లేకున్నా..తరలింపు దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా భారత్ వెళ్లాలనుకుంటున్న ప్రవాసీయులతో యూఏఈలో చిక్కుకుపోయిన పర్యాటకుల వివరాలతో జాబితాను యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సిద్ధం చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుంది. అయితే..దీనిపై న్యూఢిల్లీ నుంచి ఇంకా స్పష్టమైన వివరాలు రావాల్సి ఉందని యూఏఈ భారత రాయబారి పవన్ కుమార్ తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించాలనే ఇంకా స్పష్టత లేదని..త్వరలోనే ప్రారంభించాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే...ఖతార్ లోని రాయబార కార్యాలయం మాత్రం స్వదేశానికి వెళ్లాలని అనుకుంటున్న ప్రవాసభారతీయులు, కరోనాతో చిక్కుకుపోయిన భారత పర్యాటకుల వివరాలతో జాబితాను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టింది. స్వదేశానికి వెళ్లాలని ఎదురుచూస్తున్న వారు https://forms.gle/SeB52ZJymC8VR8HN8 లింక్ ద్వారా వివరాలు నమోదు చేసుకొని రాయబార కార్యాలయం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి వెళ్లాలని అనుకుంటున్న వారి వివరాలను మాత్రమే సేకరిస్తున్నామని..అయితే..విమానాలు ఎప్పుడు పునరుద్దరిస్తారనే వివరాలపై స్పష్టత మాత్రం లేదని కూడా ఖతార్ లోని రాయబార కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







