కోవిడ్ 19 / సౌదీ: తెరుచుకోనున్న మాల్స్..ఇవి గమనించండి..

- April 28, 2020 , by Maagulf
కోవిడ్ 19 / సౌదీ: తెరుచుకోనున్న మాల్స్..ఇవి గమనించండి..

సౌదీ: బుధవారం (ఏప్రిల్ 29) నుండి మాల్స్‌లో వాణిజ్య కార్యకలాపాలను పునఃప్రారంభిస్తున్నందున కరోనా ను దృష్టిలో పెట్టుకొని మాల్స్ పాటించే ముందస్తు జాగ్రత్తలను ప్రకటించిన రియాద్ మునిసిపాలిటీ.

పాటించే జాగ్రత్తలు..
* మాల్స్ లోపల అన్ని వినోద మరియు ఆట స్థలాలు మూసివేయబడతాయి. 15 ఏళ్లలోపు పిల్లల ప్రవేశం నిషిద్ధం.
* మాల్ ప్రవేశ ద్వారాల వద్ద ప్రతిఒక్కరికి మాస్క్ లు, గ్లౌజులు అందించబడతాయి. వీటిని సందర్శకులు తప్పనిసరిగా ధరించేలా చూడడానికి అన్ని మాల్స్‌లో ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా సిబ్బంది ఉంటారు.
* మాల్స్ లో ప్రవేశించే ప్రతి ఒక్కరికి శరీర ఉష్ణోగ్రత రికార్డు చేయటం జరుగుతుంది. సదరు వ్యక్తికి 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న యెడల వారి ప్రవేశం నిషేదించబడుతుంది. దీనికి గాను ప్రత్యేక వైద్య మరియు స్టెరిలైజేషన్ బృందాలు అందుబాటులో ఉంటాయి.
* ప్రతి 24 గంటలకు మొత్తం మాల్ ను క్రిమిరహితం చేయడం జరుగుతుంది.
* ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా మాల్స్ లో మార్గదర్శకాల యొక్క వివరణాత్మక సంకేతాలను ఉంచటం జరుగుతుంది.
* ప్రజలు సాధ్యమైనంతవరకు మాల్ లో అంతస్తులకు చేరుకోవటానికి మెట్లు లేదా ఎస్కలేటర్లను వాడాలి. అవి అనుబాటులో లేని యెడల లిఫ్ట్ లు వాడుతున్నపుడు ఒకేసారి ఇద్దరు వ్యక్తులను మాత్రమే అనుమతించాలి.

కర్ఫ్యూ సవరణ:
పవిత్ర రంజాన్ మాసానికి సౌదీ అరేబియా ఏప్రిల్ 21 నుండి కర్ఫ్యూ సమయాలను సవరించింది. ప్రస్తుతం 24-గంటల లాక్డౌన్ కింద లేని అన్ని ప్రాంతాలు మరియు నగరాల్లోని నివాసితులు ఉదయం 9 మరియు సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్ళడానికి వీలు కల్పించింది. రియాద్, తబుక్, దమ్మామ్, ధహ్రాన్, మరియు హోఫుఫ్ నగరాలపై మరియు జెడ్డా, తైఫ్, ఖతీఫ్ మరియు ఖోబార్ గవర్నరేట్ల అంతటా 24 గంటల లాక్డౌన్ విధించబడింది. పవిత్ర నగరాలైన మక్కా మరియు మదీనాపై కూడా ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com