కోవిడ్ 19/దుబాయ్: జూలై నుండి పర్యాటకులను స్వాగతించే అవకాశం
- April 28, 2020
దుబాయ్: దుబాయ్ ఆర్ధిక వ్యవస్థకు ఆయువుపట్టు పర్యాటక రంగం. కరోనా తో పర్యాటక రంగం ఘోరంగా దెబ్బతింది. మార్చి నుండి పర్యాటక మరియు సందర్శకుల వీసాల జారీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది దుబాయ్ కి 16.7 మిలియన్ల మంది పర్యాటకులు విచ్చేయటం జరిగింది. వీరు స్థానిక ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్ దిర్హాములకు పైగా తోడ్పడ్డారు.
జూలై నుంచి పర్యాటకులను స్వాగతించేందుకు దుబాయ్ సన్నద్ధమవుతోందని వాణిజ్య మార్కెటింగ్ విభాగం డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మార్రి తెలిపారు. అప్పటి కోవిడ్ -19 పరిణామాలను మరియు అంతర్జాతీయ పరిణామాలను అనుసరించి పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అనుమతించటమా లేక పరిమితిలో అనుమతించటమా అనేది ఆలోచిస్తామనీ, లేదా ఈ నిర్ణయం సెప్టెంబర్ వరకు వాయిదాపడే అవకాశం లేకపోలేదు అని హెలాల్ తెలిపారు.
ప్రస్తుతం, దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి యూఏఈ అధికారులు ఇన్-బౌండ్ ఎయిర్ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. విదేశీ విమానయాన సంస్థల తో కూడి యూఏఈ లో చిక్కుకున్న విదేశీయులను వారి వారి స్వదేశాలకు పంపటం జరుగుతోందని ఈ సందర్భంగా హెలాల్ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







