కరోనా వైరస్: ఇండియన్ డాక్టర్‌కి దుబాయ్ పోలీసుల సెల్యూట్
- April 28, 2020
దుబాయ్ :దుబాయ్‌లో ఓ ఇండియన్ డాక్టర్‌కి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్ అయేషా సుల్తానా తన విధుల్ని ముగించుకుని, ఇంటికి వెళుతున్న సమయంలో దుబాయ్ పోలీస్ ఆమెను ఆపడం జరిగింది. ఆమె, తన వద్దనున్న డాక్యుమెంట్స్‌ని పోలీసులకు చూపించారు. అయితే, ఆమె డాక్టర్ అని తెలుసుకున్న పోలీసులు, డాక్యుమెంట్స్ తనిఖీలు చేయకుండానే ముందుకు వెళ్ళమని సూచించారు. అంతే కాకుండా, ఆ డాక్టర్‌కి పోలీసులంతా సెల్యూట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘యూఏఈ నివాసితురాలిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ గౌరవానికి నేను ఉప్పొంగిపోతున్నాను..’ అని ఆమె పేర్కొన్నారు. కాస్సేపు తన కళ్ళు చెమర్చాయనీ, అంతలా పోలీసుల సెల్యూట్ తనను కదిలించిందని చెప్పారామె. కాగా, ఫ్రంట్ లైన్ వారియర్స్‌లా కోవిడ్-19పై పోరాటంలో పనిచేస్తున్న డాక్టర్లకు యూఏఈలో ప్రత్యేక గౌరవం దక్కుతోంది.
----బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







