దోహా: కేబినెట్ కీలక నిర్ణయాలకు ఖతార్ ఆమిర్ ఆమోదం

- April 28, 2020 , by Maagulf
దోహా:  కేబినెట్ కీలక నిర్ణయాలకు ఖతార్ ఆమిర్ ఆమోదం

దోహా:ఖతార్ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు అమిర్ షేక్ తమిమ్ బిన్ హమిద్ అల్ తని ఆమోదం తెలిపారు. రియల్ ఎస్టేట్, యూనిఫైడ్ ఎకానమి రిజిస్ట్రి , జాతీయ విద్యా, విజ్ఞాన, సంస్కృత కమిషన్ కి సంబంధించి కేబినెట్ నిర్ణయాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారిక ఆదేశాలు రాగానే కేబినెట్ నిర్ణయాలు అన్ని అమలులోకి రానున్నాయి. కేబినెట్ డిసిషన్ నెం. 10, 2020 మేరకు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కమిటి ఏర్పాటు చేయాలని ఖతార్ కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ డిసిషన్ నెం. 11,2020 తీయ విద్యా, విజ్ఞాన, సంస్కృత కమిషన్ ని గుర్తించటం, కేబినెట్ డిసిషన్ నెం 12, 2020 మేరకు ఎగ్జిక్యూటీవ్ రెగ్యులేషన్స్ లా  నెం.1, 2020 సంబంధించి ఏకీకృత ఆర్ధిక రిజిస్ట్రికి ఆమీర్ ఆమోదం తెలిపారు. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com