భారత్ లో 1000 దాటిన మృతులు...

- April 29, 2020 , by Maagulf
భారత్ లో 1000 దాటిన మృతులు...

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఉద్ధృతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 1897 కేసులు నమోదవడంతో... మొత్తం కేసుల సంఖ్య 31332కి చేరింది. అలాగే... సోమవారం 62 మంది చనిపోగా... మంగళవారం ఏకంగా 73 మంది చనిపోయారు. అంటే... ఒక్క రోజులో మృతుల సంఖ్య అదనంగా 11 పెరిగింది. దీన్ని బట్టీ దేశంలో కరోనా పెరుగుతూనే ఉందని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మృతుల సంఖ్య వెయ్యి దాటి... 1007కి చేరింది. ఇదేమీ చిన్న సంఖ్య కాదు కదా. ప్రస్తుతం దేశంలో 7696 మంది రికవరీ లేదా డిశ్చార్జి అవ్వగా... 22629 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

దేశంలో ఏ రాష్ట్రాల్లో కరోనా ఎలా ఉందంటే:
మహారాష్ట్ర 9318 గుజరాత్ 3744
ఢిల్లీ 3314
మధ్యప్రదేశ్ 2387
రాజస్థాన్ 2364తమిళనాడు 2058
ఉత్తరప్రదేశ్ 2053
ఆంధ్రప్రదేశ్ 1259
తెలంగాణ 1004
బెంగాల్ 725
జమ్మూకాశ్మీర్ 565
కర్ణాటక 523
కేరళ 485
బీహార్ 366
పంజాబ్ 322
హర్యానా 310
ఒడిశా 118
జార్ఖండ్ 103
చండీగర్ 56
ఉత్తరాఖండ్ 54
హిమాచల్ ప్రదేశ్ 40
ఛత్తీస్‌గఢ్ 38
అసోం 38
అండమాన్ నికోబార్ 33
లఢక్ 22
మేఘాలయ 12
పుదుచ్చేరి 8
గోవా 7
మణిపూర్ 2
త్రిపుర 2
మిజోరం 1
అరుణాచల్ ప్రదేశ్ 1

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com